ములుగు, వెలుగు: మండలంలోని కొత్తూరు గ్రామంలో సోమవారం ఎంపీవో కలీం ఆధ్వర్యంలో తై బజార్ వేలం జరుగుతుందని సర్పంచ్ గడిల సరితగోవర్ధన్ తెలిపారు. వేలం వేసేవారు ముందుగా రూ.50 వేలు డిపాజిట్ చేయాలన్నారు.
వేలం దక్కనివారికి డిపాజిట్ చేసిన డబ్బులు అప్పుడే తిరిగి ఇచ్చేస్తారని పేర్కొన్నారు. వేలంలో గ్రామస్తులు పెద్ద మొత్తంలో పాల్గొనాలని సర్పంచ్ సరితగోవర్ధన్ పిలుపునిచ్చారు.
