న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఓ వెయిటర్‌ను కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నాడు. అతన్ని వెతికిపెట్టాలని నెటిజన్స్ ను కూడా కోరాడు.తాను క్రికెట్ ఆడుతున్న రోజుల్లో ఆ వెయిటర్ కెరీర్‌కు ఉపయోగపడే సలహా ఇచ్చా డని, అందుకే అతన్ని కలవాలనుందని సచిన్ ట్విటర్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు. ‘ఓ టెస్ట్ సిరీస్ సందర్భం గా చెన్నైలోని తాజ్ కోరమండల్ హోటల్ వెయిటర్ నన్ను కలిశాడు. నా అభిమా నని చెబుతూ.. బ్యాటింగ్ కు సంబంధించి ఓ విలువైన సలహా ఇచ్చాడు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎల్బో గార్డ్ అడ్డు తగులుతుందని, నా బ్యాటింగ్ శైలిని నిశితంగా పరిశీలించినప్పుడు ఈ విషయం అర్థమైందని వివరించాడు.అతని సూచనతో ఎల్బో గార్డ్ సైజ్ మార్చుకొని నేను అద్భుతంగా రాణించా. ఆ వెయిటర్ సలహా నాకు బాగా ఉపయోగపడింది. ప్రపంచంలో ఎవ్వరూ గుర్తించని నా సమస్యను ఆ వెయిటర్ కనుగొన్నా డు.అతన్ని ఇప్పుడు మరోసారి కలవాలనుంది. నెటిజన్స్.. కొంచెం ఆ వెయిటర్‌ను వెతికిపెట్టండి ’అని ఆ వీడియోలో సచిన్ విజ్ఞప్తి చేశాడు. సచిన్ విన్నపానికి తాజ్ హోటల్ స్పందిచింది. మాస్టర్‌కు సలహా ఇచ్చిన తమ ఉద్యోగిని గుర్తించామని తెలుపుతూ సచిన్‌తో అతను దిగిన ఫొటోను షేర్ చేసింది. ‘సచిన్.. మా కొలిగ్ తో మీకున్న చిరస్మరణీయ జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. అతన్ని మేం గుర్తించాం. మీ ఇద్దరిని కలుపబోతున్నందుకు సంతోషంగా ఉన్నాం ’ అని ట్వీట్ చేసింది.

