ఎంపీ అర్వింద్​పై చర్యలు తీసుకోండి.. సీఈవోకు బీఆర్ఎస్​ కంప్లైంట్

ఎంపీ అర్వింద్​పై చర్యలు తీసుకోండి.. సీఈవోకు బీఆర్ఎస్​ కంప్లైంట్

హైదరాబాద్, వెలుగు : నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై చర్యలు తీసుకోవాలని సీఈవోకు బీఆర్ఎస్​ కంప్లైంట్​ చేసింది. గురువారం సీఈవో వికాస్ ​రాజ్​ను బీఆర్ఎస్​ లీగల్​ సెల్​ ఇన్ చార్జ్​ సోమ భరత్​ కుమార్​గుప్తా కలిసి ఫిర్యాదు చేశారు. ఎంపీ అర్వింద్ ​ఇటీవల నిర్వహించిన ఒక బహిరంగ సభలో ప్రజలు నోటా, హస్తం (కాంగ్రెస్), కారు (బీఆర్ఎస్)కు ఓటేసినా గెలిచే ది తానేనని అన్నారని, దానికి సంబంధించిన వీడియో ఉన్న పెన్​డ్రైవ్​ను కంప్లైంట్​కు జత చేశా మని తెలిపారు. 

ఎంపీ చేసిన ఈ కామెంట్స్​ఓటరు గోప్యతకు భంగం కలిగిస్తున్నాయన్నారు. ఓటర్లు ఏ సింబల్​పై నొక్కినా ఆ ఓటు బీజేపీకే పడుతుందన్నట్టుగా అర్వింద్​ స్టేట్​ మెంట్​ఉందని ఆరోపించారు.  రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికల్లో ఈవీఎలంను దుర్వినియోగం చేయబోతున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు.  వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.