రోడ్ల వెంట చెత్త వేసేవారికి ఫైన్

రోడ్ల వెంట చెత్త వేసేవారికి ఫైన్

చందానగర్, వెలుగు: రోడ్ల వెంబటి చెత్త వేసేవారికి జరిమానాలు విధించాలని చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డా.ఎన్.యాదగిరిరావు అన్నారు. మంగళవారం ఆయనశానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలనిసూచించారు. సర్కిల్ పరిధిలోని హోటళ్లు,రెస్టారెంట్ లు, ఫంక్షన్ హాళ్ల నుంచి వసూలు చేసిన ట్రేడ్ లైసెన్సు ఫీజుల గురించి సమావేశంలో చర్చించారు. లేని వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్ , సర్కిల్ వైద్యాధికారి డా.కేఎస్.రవి, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లపై డీసీ ఏఎంసీలు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్ లు,బిల్ కలెక్టర్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్ వారా రూ.9 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని సూచించారు.