
- సెక్యూరిటీ డ్రైవ్లు, చెకింగ్లు నిర్వహించండి
- జీఎం అరుణ్ కుమార్ జైన్
హైదరాబాద్, వెలుగు : రైల్వేలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ డివిజనల్ రైల్వే మేనేజర్ల (డీఆర్ ఎం)లను ఆదే శించారు. ఇందులో భాగంగా సెక్యూరిటీ డ్రైవ్లు, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. బుధవారం రైల్ నిలయంలో సికింద్రాబాద్, హైదరా బాద్, విజయవాడ, గుంతకల్, గుం టూరు, నాందేడ్ ల డీఆర్ ఎంలు, లాలాగూడ వర్క్ షాప్ చీఫ్ మేనేజర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీఎం సమావేశం అయ్యారు. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, యార్డ్ మాస్టర్లు, పాయింట్స్ మెన్, ఇతర క్షేత్ర స్థాయి సిబ్బందికి రెగ్యులర్ గా కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు. సిబ్బందికి సరైన విశ్రాంతిని ఇచ్చేందుకు కచ్చితమైన ప్లాన్ రెడీ చేసి అమలు చేయాలని చెప్పారు.