Beauty Tips : మీ పెదాలు పగులుతున్నాయా.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి

Beauty Tips : మీ పెదాలు పగులుతున్నాయా.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి

చలికాలంలోనే పెదాలు పగుల్తాయనుకుంటే పొరపాటే. పెదవులపై చర్మం పొరలుగా వచ్చేయడం, పగుళ్లు ఏర్పడడం, రక్తం కారడం అన్ని కాలాల్లో ఎదురయ్యే సమస్యే. పగుళ్ల వల్ల పెదాలు మంటపుడతాయి. దాని వల్ల ఏం తినలేనిస్థితి కూడా ఏర్పడుతుంది. అంతేకాదు వీటటిని పట్టించుకోకపోతే పెదవుల ఇన్ ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది.

  చర్మంపై నూనె గ్రంథులు ఉన్నట్లు పెదాలపై ఉండవు. అందుకే పెదాలు త్వరగా పొడిబారుతాయి.. డైటింగ్ చేసేవారిలో, పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. 

కొన్ని కారణాలు

ఏకాలంలోనైనా పెదాల పగుళ్లకు ప్రధాన కారణం డీహైడ్రేషన్, శరీరానికి సరిపడా నీరు అందకపోతే, శరీరం డీహైడ్రేషన్కి గురై పెదాలపై పగుళ్లు ఏర్పడతాయి. అంతేకాదు వాతావరణంలో మార్పులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, విటమిన్-12, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ లాంటివి తక్కువైనప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. బిటిస్టిక్స్లో వాడే రసాయనాల ప్రభావం వల్ల కూడా కొందరికి ఈ సమస్య వస్తుంది. నోటితో గాలి పీల్చే అలవాటు కారణంగా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. వాతావరణంలోని మార్పుల వల్ల పెదాల మంటలు వస్తే వ్బామ్, పెట్రోలియం జెల్లీ వంటివి రాస్తే తగ్గిపోతుంది. ఒక వేళ అలా తగ్గకుండా రోజు రోజుకి ఇంకా పెరుగుతూ పోతే డాక్టర్ని సంప్రదించాలి. 

నాలుకతో తడపొద్దు 

పెదాలు పగిలి ఇబ్బంది పెడుతుంటే.. లిప్ స్టిక్స్, లిప్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు. వాటిల్లోని రసాయనాలు పెదాల్లోని తేమని పీల్చుకుని సమస్యను తీవ్రతరం చేస్తాయి. అలాగే పెదాలు పగిలినప్పుడు చాలా మంది నాలుకతో తడిచేసుకుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. ఈ సమస్య ఎదురైనప్పుడు పెదాలమీద పై పొర కొంచెం కొంచెం లేస్తుంది.ఈ దశలో కొందరు ఆ పొరను మొత్తం తీసేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ స్థితిలో ఒక్కోసారి రక్తం వచ్చి సమస్య అధికమవుతుంది.

ఈ జాగ్రత్తలు పాటించాలి.

 పెదాల పగుళ్ల నుంచి ఉపశమనం కోసం.చాలామంది లిబ్బామ్స్ ని వాడుతుంటారు. కానీ నాణ్యమైన లివామ్స్ నే వాడాలి. అలాగే ఎస్ఎఫ్ 15 ఉన్న లిప్ క్రీమ్స్ ని ఎంచుకోవాలి. చల్లని వాతావరణంలోకి వెళ్లినప్పుడు పెదాలకు గాలి తగలకుండా చూసుకోవాలి. కోకో పొడి, సహజ నూనెలు, ఎసెన్షియల్ నూనెలు ఉన్న మాయిశ్చరైజర్లనే ఎంచుకోవాలి, పెట్రోలియం జెల్లీ రాసి.. తర్వాత లిబామ్ రాయాలి. అలాగే టొమాటోలో సెలినీయం అనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సూర్యకిరణాల నుంచి పెదవులను కాపాడుతుంది. అందువల్ల ప్రతిరోజు టొమాటోని ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. సగటున శరీరానికి అవసరమయ్యే నీటితో పాటు ఈ సమస్య ఎదురైనప్పుడు ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. దీనివల్ల శరీరంతోపాటు పెదాలు కూడా పొడిబారకుండా ఉంటాయి. అలాగే రోజూ చెంచా తేనె తీసుకోవాలి. విటమిన్ బి-12 అధికంగా తీసుకోవడం వల్ల పెదాలు చిట్లకుండా ఉంటాయి. అలాగే ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ లాంటి పోషక విలువలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

రక్తస్రావం

పెదాలను కొరకడం, మాటిమాటికీ తడి చేసుకోవడం వల్ల పెదాల నుంచి రక్తం వస్తుంది. టూత్ పేస్ట్ పడకపోయినా పెదాల చివర్లలో పగిలి రక్తం వస్తుంది. దీనివల్ల పెచ్చులు కట్టడం, పొట్టు రాలడం, పెదాల వాపు వంటి సమస్యలు వస్తాయి. పగిలిన పెదాలనుంచి రక్తస్రావం ఎక్కువగా అవుతుంటే ఐసుముక్కలను అద్దాలి. లేదంటే మెత్తటి వస్త్రంలో ఐసు ముక్కల్ని ఉంచి.. పెదవులపై కాసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్తస్రావం ఆగి పెదాలకు తేమ అందుతుంది. తినలేని స్థితి కూడా ఏర్పడుతుంది. అంతేకాదు. వీటిని పట్టించుకోకపోతే పెదవులు ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది.