ఇథనాల్​ కంపెనీతో మాకు సంబంధం లేదు

ఇథనాల్​ కంపెనీతో మాకు సంబంధం లేదు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్​

హైదరాబాద్​, వెలుగు: దిలావర్ పూర్ లో ఇథనాల్​ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ఆ కంపెనీలో తన కొడుకు సాయికిరణ్​కు భాగస్వామ్యం లేదని చెప్పారు. పీసీసీ చీఫ్​మహేశ్​ కుమార్​గౌడ్, మంత్రి సీతక్క, ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి మాటల్లో అర్థం లేదన్నారు. కంపెనీతో తన కొడుకుకి సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే వాళ్లకే రాసిస్తానని పేర్కొన్నారు.

గురువారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇథనాల్ ​కంపెనీపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. శుక్రవారం దీక్షా దివస్ ​సందర్భంగా తెలంగాణ భవన్​లో ఉద్యమ నేపథ్యాన్ని వివరించేలా డాక్యుమెంటరీలను ప్రసారం చేస్తామని తలసాని వెల్లడించారు. అనంతరం సభ నిర్వహిస్తామన్నారు.