హ‌‌ల్లో మీమ్స్ వాలా సాంగ్ రిలీజ్

హ‌‌ల్లో మీమ్స్ వాలా సాంగ్ రిలీజ్

‘బాహుబలి’ ప్రభాకర్ లీడ్ రోల్‌‌లో పాలిక్ దర్శకుడిగా రావుల రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్ర రూపాయ నమ:’.  పాయల్ రాజ్‌‌పుత్ కీలక పాత్ర పోషిస్తోంది. ర‌‌ఘు, వెంక‌‌ట్, మోహ‌‌న సిద్ధిఖి, తాగుబోతు ర‌‌మేష్‌‌ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలను విడుదల చేయగా, మంగళవారం మూడో పాటను తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేసి టీమ్‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు.

జాన్ భూషణ్ కంపోజ్ చేసిన ఈ పబ్ సాంగ్‌‌కు  ‘హ‌‌ల్లో హ‌‌ల్లో మీమ్స్ వాలా.. పుల్‌‌గా ఫోక‌‌స్ ఆన్ మీ రో.. హ‌‌ల్లో హ‌‌ల్లో ట్రోల్స్ వాలా.. మేక్ మి మేక్ మి ఫేమ‌‌స్ రో’   అంటూ  సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ రాశారు. ఉమ నేహా పాట పాడింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.