నూతన వధువు కోసం మిలటరీ హెలికాప్టర్ వాడిన తాలిబన్ కమాండర్

నూతన వధువు కోసం మిలటరీ హెలికాప్టర్ వాడిన తాలిబన్ కమాండర్

తాలిబన్లు రాజ్యం ఏలుతున్న అప్ఘాన్ లో జరిగిన ఓ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. నూతన వధువును తీసుకెళ్లేందుకు తాలిబన్ కమాండర్ మిలటరీ హెలికాప్టర్ ఉపయోగించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అక్కడి మీడియా Khaama Press వెల్లడించింది. తూర్పు అప్ఘనిస్తాన్ లోని లోగర్ నుంచి ఖోస్ట్ ప్రావిన్స్ Haqqani branch కమాండర్ తీసుకెళ్లినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. హెలికాప్టర్ లో నూతన వధువు ఇంటి దగ్గర దిగడం ఆ వీడియోలో కనిపించినట్లు తెలిపింది. వివాహం సందర్భంగా వధువు తండ్రికి రూ. 1,20,000 అప్ఘన్ లను కట్నం కింద ఇచ్చినట్లు పేర్కొంది. ఖోస్ట్ లో కమాండర్, నూతన వధువు బార్కి బరాక్ జిల్లాలో నివాసం ఉంటారని జాతీయ ఛానెల్ కు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను తాలిబన్ డిప్యూటీ అధికార ప్రతినిధి యూసుఫ్ అహ్మదీ ఖండించారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అప్ఘినిస్తాన్ కూడా ఈ వార్తలను తోసిపుచ్చింది. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ చర్యను కొంతమంది ఖండించారు. ప్రజల డబ్బులను దుర్వినియోగం చేయడమేనని తెలిపారు. 

అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలపై అనేక ఆంక్షలు పెడుతున్నారు. వారి హక్కులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. బాలికల చదువు, మహిళల వస్త్ర ధారణ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అక్కడ జరుగుతున్న అణిచివేతపై హ్యూమన్ రైట్స్ వాచ్ మహిళల హక్కుల విభాగం హీథర్ బార్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా.. ముఖంతో సహా శరీరాన్ని కప్పి ఉంచాలని మే నెలలో తాలిబన్లు ప్రకటించారు. 2021, ఆగస్టు 15 రాజధాని కాబూల్ ను స్వాధీనం చేసుకున్నారు. మహిళల హక్కులను గౌరవిస్తామని అధికారం చేజిక్కించుకున్న అనంతరం చెప్పినా.. అలా చేయలేదు. వీరి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అంతర్జాతీయ సంస్థలు, వివిధ దేశాలు ఖండిస్తూ వచ్చాయి.