తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్

రాష్ట్ర గవర్నర్ ESL నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమళైసాయి సౌందర రాజన్ నియమితులయ్యారు. రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత , కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా  నియమించింది కేంద్రం.  ప్రస్తుతం హిమాచల్ గవర్నర్ గా ఉన్న కల్ రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్ గా బదిలీ చేశారు.

మహరాష్ట్ర గవర్నర్ గా భగత్ సింగ్ కోషియారిని నియమించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో కొత్త గవర్నర్ ను అపాయింట్ చేసింది కేంద్రం. కేరళ కొత్త గవర్నర్ గా అరిఫ్ మహ్మద్ ఖాన్ ను నియమించారు.