
తమన్నా(Thamannaah) జోరు ఇప్పట్లో తగ్గేలాలేదు. సౌత్‌లో 14 ఏళ్ల ప్రాయంలోనే హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీకి సెకండ్ ఇన్నింగ్స్ కలిసొచ్చింది. ఈ విషయం తమన్నా మరోసారి ప్రూవ్ చేసింది. తాజాగా ఆమె నటించిన ఆఖరి సచ్(Aakhri Sach) సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది.
ఈ సిరీస్ రెండు ఎపిసోడ్లు రిలీజ్ చేయగా.. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్ చూసినవారంతా తమన్నా గురించే మాట్లాడుతున్నారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా మెచ్యూర్డ్ నటన కనబరిచిందంటూ ప్రశంసిస్తున్నారు.
ఇప్పటివరకు గ్లామర్ డాల్‌గా ముద్రపడిన తమన్నాకి ఇలాంటి రోల్స్ దక్కడంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇటీవల తెలుగులో ఆమె నటించిన భోళా శంకర్ సినిమా విడుదలై నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. అందులో తమన్నా యాక్టింగ్‌పై ట్రోలింగ్ జరిగింది. కానీ, ఓటీటీలో మాత్రం ఈ ముద్దుగుమ్మ అదరగొడుతోంది.