
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. రోజు రోజుకు ఈ కేసు కీలక మలుపు తిరుగుతోంది.ఈ కేసు విషయంలో ఇప్పటికే పలువురు అరెస్టైయ్యారు. వీరిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ముఖ్య అనుచరుడుగా చెప్పుకుంటున్న A34 నిందితుడైన వెంకటేశ్ నాయుడు పేరు మార్మోగిపోతోంది. నోట్ల కట్టలను లెక్కిస్తున్న వీడియో వైరల్ అవుతుండగా.. మరో ఆసక్తికరమైన ఫోటోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియాతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫోటోలు సంచనలంగా మారాయి. రాజకీయ నేతలతోనే కాదు సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో కుడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. తమన్నతో కలిసి వెంకటేశ్ ప్రత్యేక జెట్ లో ప్రయాణించారు. ఎయిర్ పోస్టులో ఫోటోలకు పోజులిచ్చారు. ఇప్పుడు ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కేసు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వైపు కూడా మళ్లీందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తమన్నాతో కూడా స్పెషల్ ఫ్లైట్ లో తిరిగాడు అంటే యవ్వారం చాలా దూరం ఉంది pic.twitter.com/b3wwTcziP3
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 🛕🇮🇳 (@Shiva4TDP) August 3, 2025
తమన్నా బాటీయా, వెంకటేశ్ నాయుడుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ ఇద్దరూ ఒకే జెట్ లో ఎప్పుడు ప్రయాణించారు? ఎందుకు కలిశారు? , ఎక్కడి వెళ్లారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు టాలీవుడ్ తో పాటు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే స్పెషల్ జెట్ ప్రయాణంపై తమన్నా ఇంకా స్పందించలేదు. ఈ పరిణామల నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కేసు విచారణలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేసి చూడాలి.