
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో ‘బబ్లీ బౌన్సర్’ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ మధుర్ బండార్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ద స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. సెప్టెంబర్ నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని ప్రకటించారు.
ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 23నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ్, హిందీలో వీక్షించవచ్చని మేకర్స్ తెలిపారు. తమన్నా ఈ సినిమాలో ఉత్తర భారతదేశంలోని గ్రామానికి చెందిన యువతిగా నటించింది. ఓ కొత్త పాత్రలో కనిపించనుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్, సాహిల్ వెయిద్ కీలక పాత్రలు పోషించారు.