విజయ్కి పోటీగా ..విశాల్ కొత్త పొలిటికల్ పార్టీ.!

విజయ్కి పోటీగా ..విశాల్ కొత్త పొలిటికల్ పార్టీ.!

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సినిమా హీరోలు రాజకీయాల్లో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరో దళపతి విజయ్  తమిళగ వెట్రి కజగం పేరుతో రాజకీయ పార్టీ  ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇపుడు విజయ్ బాటలో మరో  స్టార్ హీరో విశాల్ పొలిటికల్ పార్టీని ప్రకటించిందేకు సిద్ధమైనట్లు  ప్రచారం జరుగుతోంది. విశాల్ పార్టీ ఏర్పాటుకు తన అభిమాన సంఘం విశాల్ మక్కల్ నల ఇయక్కం నేతలతో మాట్లాడుతున్నారని సమాచారం.. ఇవాళ మీడియాతో మాట్లాడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  విశాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సమాచారం.

విశాల్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు. జయలలిత మరణం తర్వాత  విశాల్ చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. అయితో కొన్ని కారణాల వల్ల విశాల్ నామినేషన్ తిరస్కరించింది ఎన్నికల కమిషన్.  విశాల్ ప్రస్తుతం విశాల్ పీపుల్స్ హెల్త్ మూమెంట్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.  చెన్నై వరదల సమయంలోనూ పేద ప్రజలకు హెల్ప చేశాడు. 

అప్పట్లో తమిళనాడులో ఎంజీఆర్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు.  అంతకుముందు అన్నాదురై, కరుణానిధి సినిమాల నుంచి వచ్చే  రాజకీయాల్లో  ఓ వెలుగు వెలిగారు. ఎంజీఆర్ తర్వాత ఆయన పార్టీని జయలలిత నడిపారు. తర్వాత విజయ్ కాంత్, కమల్ హాసన్ పొలిటికల్ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇటీవల విజయ్ పొలిటికల్ పార్టీని ప్రకటించారు.