తమిళ బుల్లితెర నటి మహాలక్ష్మి, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లి చేసుకోవడంతో సోషల్ మీడియా మొత్తం వల్లపైనే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే.. రవీందర్ చంద్రశేఖరన్ చాలా లావుగా, మహాలక్ష్మి ముద్దుగా అందంగా ఉంటుంది. అందుకే ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవండ ఏంటి అని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రేమకు అందం, ఆకారం ఆవసరం లేదని ప్రూవ్ చేశారు ఈ జంట. దీంతో ఈ జంట కాస్త ఆదర్శ జంటల లిస్టులోకి వెళ్ళింది.
అయితే తాజాగా ఈ జంట గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే.. త్వరలో ఈ జంట విడాకులు తీసుకోనున్నారు అని. కానీ ఈ విషయంపై తాజాగా ఈ జంట క్లారిటీ ఇచ్చింది. ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ.. భర్తతో కలిసి ఉన్న ఫోటోలు తరచూ షేర్ చేస్తూనే ఉంటుంది మహాలక్ష్మి. ఇక తాజాగా భర్తతో కలిసి దిగిన మరో ఫోటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రొమాంటిక్ పోస్ట్ పెట్టింది. 'నువ్వు నా భుజంపై చేయి వేసినప్పుడు ఈ ప్రపంచంలో నేను ఏదయినా చేయగలను అన్నంత ధైర్యం వస్తుంది. నా మనసు నిండా నువ్వే అమ్ము, ఐ లవ్యూ' అని క్యాప్షన్ ఇచ్చింది. దీనికి రవీందర్ లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వీరి విడాకులపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.