లోకేష్ కనగరాజ్ హీరోగా డీసీ

లోకేష్ కనగరాజ్ హీరోగా డీసీ

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఖైదీ, విక్రమ్, కూలీ లాంటి చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపును అందుకున్న లోకేష్.. ఇప్పుడు నటుడిగా పరిచయం అవుతున్నాడు. తను లీడ్ రోల్‌‌లో అరుణ్ మాథేశ్వరన్‌‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సన్‌‌ పిక్చర్స్‌‌ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్‌‌ సంగీతం అందిస్తున్నాడు. శనివారం ఈ మూవీకి ‘డీసీ’ అనే టైటిల్‌‌ను ఖరారు చేస్తూ, టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. 

ఇందులో దేవదాస్‌‌గా లోకేష్‌‌, చంద్ర అనే పాత్రలో వామికా గబ్బీ నటిస్తున్నారు. పాత్రల ఆధారంగానే ఈ టైటిల్‌‌ పెట్టినట్టు అర్థమవుతోంది. ఇక టీజర్‌‌‌‌లో ఒళ్లంతా రక్తం, చేతిలో గన్‌‌ పట్టుకుని,  సిగరెట్ కాలుస్తూ ఓ లాడ్జ్‌‌లో నడుచుకుంటూ వస్తున్నాడు లోకేష్. జడలో గులాబీ పువ్వు, చేతిలో కండోమ్‌‌ ప్యాకెట్‌‌తో వామికా కనిపించింది.  ఇద్దరూ కలిసి ఓ గదిలో అతనికి ఎదురు పడటాన్ని టీజర్‌‌‌‌గా కట్‌‌ చేశారు. 

 ఇందులో వేశ్య పాత్రలో వామిక నటిస్తోందని, ఇదొక పీరియాడిక్‌‌ డ్రామా అని అర్థమవుతోంది. రా అండ్‌‌ రస్టిక్‌‌ ఫీల్‌‌తో ఉన్న టీజర్‌‌‌‌కు అనిరుధ్‌‌ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్‌‌ స్కోర్‌‌‌‌ ఇంప్రెస్ చేసింది. వచ్చే ఏడాది సమ్మర్‌‌‌‌లో సినిమా విడుదల కానుంది.