రాజకీయాల కోసం జాతీయ అవార్డుల గౌరవాన్ని దెబ్బతీయకూడదు :  సీఎం స్టాలిన్

రాజకీయాల కోసం జాతీయ అవార్డుల గౌరవాన్ని దెబ్బతీయకూడదు :  సీఎం స్టాలిన్

69వ జాతీయ చలన చిత్ర  అవార్డుల ప్రకటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.   వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన  'ది కాశ్మీర్ ఫైల్స్' జాతీయ సమైక్యత అవార్డుకు ఎంపిక చేయబడడాన్ని ఆయన తప్పుబట్టారు.  జాతీయ చలనచిత్ర అవార్డుల గౌరవాన్ని రాజకీయాలతో ముడిపెట్టకుడదని అన్నారు. విమర్శలు ఎదురుకున్న చిత్రాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించారు.   చౌకబారు రాజకీయాల కోసం జాతీయ అవార్డుల గౌరవాన్ని దెబ్బతీయకూడదని  ఆయన అన్నారు. 

కాగా  'ది కాశ్మీర్ ఫైల్స్' 2023 ఆగస్టు 24 గురువారం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో జాతీయ సమైక్యత విభాగంలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నర్గీస్ దత్ అవార్డును గెలుచుకుంది . 1990లో కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ పండిట్ల జీవితం ఆధారంగా తీసిన 'ది కాశ్మీర్ ఫైల్స్' మార్చి 2022లో విడుదలైంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు.