వెయ్యి రూపాయిలు సంక్రాంతి గిఫ్ట్​ ప్రకటించిన ప్రభుత్వం... ఎక్కడంటే

వెయ్యి రూపాయిలు  సంక్రాంతి గిఫ్ట్​ ప్రకటించిన ప్రభుత్వం... ఎక్కడంటే




తమిళనాడు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది.  తమిళ ప్రజలకు పొంగల్​ ఫెస్టివల్​సందర్భంగా రూ. 1000 లు ఆ రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇస్తున్నట్లు సీఎం స్టాలిన్​ శుక్రవారం (జనవరి 5) ప్రకటించారు.  రేషన్ కార్డుదారులకు ఈ కానుకను అందించనున్నారు. పండుగకు ముందు న్యాయ(రేషన్​)  ధరల దుకాణాల ద్వారా వెయ్యి రూపాయల నగదును పొంగల్ కానుకగా అందజేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారు, చైనా రేషన్ కార్డుదారులు, రేషన్ కార్డులు లేనివారికి ఈ కానుక వర్తించదు. 

ధోతీ, చీర ఉచితంగా ఇస్తారు..

ప్రభుత్వం ఇప్పటికే పొంగల్‌ గిఫ్ట్‌ని ప్రకటించిందని, ఇందులో చెరకుతో పాటు ఒక కేజీ బియ్యం, పంచదార కూడా ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు. గిఫ్ట్ హ్యాంపర్‌తో పాటు ధోతి, చీర కూడా ఉచితంగా అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. కలైంజర్ మగళిర్ ఉరిమాయి తిట్టం పథకం కింద ఇచ్చే నెలకు రూ.1000 పొంగల్ పండుగకు ఐదు రోజుల ముందు జనవరి 10వ తేదీన చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల 1.15 కోట్ల మంది మహిళలు నేరుగా లబ్ధి పొందనున్నారు.