మోదీ రోడ్ షో.. అనుమతి నిరాకరించిన పోలీసులు

 మోదీ రోడ్ షో..   అనుమతి నిరాకరించిన పోలీసులు

మార్చి 18న కోయంబత్తూరులో జరగనున్న ప్రధాని మోదీ రోడ్‌షోకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.  భద్రతాపరమైన సమస్యలతో పాటుగా విద్యార్థులకు ఇంటర్ పరీక్షలు కారణాలను చూపుతూ  పోలీసులు  రోడ్‌ షోకు పర్మిషన్ ఇవ్వలేదు. కాగా ఈ నెల 18న కోయంబత్తూర్‌‌లో ప్రధాని మోదీ 4 కి.మీ పాటు రోడ్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కోయంబత్తూర్‌‌ ఎస్పీని అనుమతి కోరారు. 

పోలీసుల నిర్ణయం పట్ల బీజేపీ నాయకులు మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మోదీ రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని ఫిటిషన్ లో కోరారు. దీంతో కోర్టు తీర్పుపైన ఉత్కంఠ నెలకొంది.   కాగా  కోయంబత్తూర్‌లో ఆర్‌ఎస్‌ పురంలో 1998లో వరుస పేలుళ్లు జరిగాయి. దీంతో అప్పటినుంచి ఈ ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. 

ఇక్కడ రోడ్‌షోలు చేపట్టేందుకు ఏ రాజకీయ పార్టీలకు అనుమతులు ఇవ్వడంలేదు.  ఇక  తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో డీఎంకే ఏకంగా 24 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్‌ 8, సీపీఐ 2, సీపీఎం 2 చోట్ల విజయం సాధించింది. ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకేకు ఒక సీటు దక్కింది.