లిక్కర్ పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

లిక్కర్ పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేందుకు అనుమతిచ్చింది. స్పోర్ట్స్ స్టేడియాలతో సహా పలు బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ తాగొచ్చని స్టాలిన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 

ప్రత్యేక లైసెన్సులు

తమిళనాడు రాష్ట్రంలోని సమావేశ మందిరాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, బాంకెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాలు, గృహ కార్యక్రమాలలో మద్యం అందించడానికి ప్రత్యేక లైసెన్స్‌ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే తమిళనాడులో మద్యం అక్రమ అమ్మకాలను అరికట్టేందుకు గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలకు భిన్నంగా స్టాలిన్ ప్రభుత్వం తాజా చర్య తీసుకుంది.

జయ ప్రభుత్వ నిర్ణయం..

2016లో అప్పటి తమిళనాడు  ముఖ్యమంత్రి జయలలిత మద్యం అమ్మకాలపై కొరఢా ఝుళిపించింది. ఏకంగా 500 మద్యం దుకాణాలను మూసివేసింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల టైమింగ్స్ ను తగ్గించింది. జయ మరణం తర్వాత సీఎం పీఠం ఎక్కిన ఎడప్పాడి కె. పళనిస్వామి జయలలిత తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించారు.  ఫిబ్రవరి 20, 2017న ప్రభుత్వ రంగ టాస్మాక్ ఆధ్వర్యంలో నడిచే 500 మద్యం దుకాణాలను మూసివేయించారు.


టాస్మాక్  అంటే ఏమిటి

టాస్మాక్ అంటే తమిళనాడు ప్రభుత్వం సంస్థ. దీని ఆధ్వర్యంలోనే తమిళనాడులో మద్యం హోల్‌సేల్, రిటైల్ విక్రయాలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగానే  ఓ పన్నీర్‌సెల్వం ప్రభుత్వం జనవరి 2002లో TASMAC ద్వారా తక్కువ ధరకు మద్యాన్ని విక్రయించే విధానాన్ని  ప్రారంభించింది. 2014-5లో TASMAC వార్షిక ఆదాయం రూ. 26,188 కోట్లు కాగా... 2014-15లో టాస్మాక్ 48.23 లక్షల  మద్యాన్ని విక్రయించడం విశేషం.