త‌మిళ‌నాడులో ఈ ఒక్క‌రోజే క‌రోనా కాటుకు 68 మంది బ‌లి

త‌మిళ‌నాడులో ఈ ఒక్క‌రోజే క‌రోనా కాటుకు 68 మంది బ‌లి

త‌మిళ‌నాడులో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఒక్కరోజే వేలాది కేసులు నమోదవుతున్నాయి. వైర‌స్ బారిన ప‌డి చ‌నిపోతున్న బాధితుల సంఖ్య‌ కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆదివారం నమోదైన కరోనా కేసులు ఆ రాష్ట్ర ప్రజలను భయాందోళనల‌కు గురిచేస్తున్నాయి. గ‌డిచిన 24గంటల్లో త‌మిళ‌నాడులో 68మంది కరోనాతో మరణించారు. కేసుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో న‌మోదైంది. ఆదివారం ఒక్క‌రోజే 4,244 మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. దీంతో అక్క‌డ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,470కు చేరింది. ఇప్పటివరకు1,966 మంది కరోనాతో మరణించగా.. 46,969 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని అధికారులు తెలిపారు.