
చెన్నై: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రకటించారు. శనివారం ఆయన చెన్నైలో నిర్వహించిన రాష్ట్ర అవయవదాన దినోత్సవం ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. దాతల కుటుంబాలతోపాటు
డాక్టర్లను, నర్సులను, పారామెడికల్ సిబ్బందిని, గ్రీఫ్ కౌన్సెలర్లను సన్మానించారు. అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ.. బ్రెయిన్ డెడ్ రోగుల బంధువులు పుట్టెడు దుఃఖంలో ఉంటారని, అయినా వారు తమ బాధను దిగమింగుకుని ఆప్తుల అవయవాలను దానం చేయడానికి ముందుకొస్తారని తెలిపారు.