మైత్రీ చేతికి దళపతి గోట్ మూవీ

మైత్రీ చేతికి దళపతి  గోట్ మూవీ

కోలీవుడ్ స్టార్ విజయ్‌‌‌‌ హీరోగా వెంకట్ ప్రభు రూపొందిస్తున్న చిత్రం ‘ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్). వినాయక చవితి కానుకగా  సెప్టెంబర్ 5న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ తెలుగు రైట్స్‌‌‌‌ను దక్కించుకుంది. ఆంధ్ర, తెలంగాణలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు.  విజయ్‌‌‌‌కి ఇది 68వ చిత్రం. 

 ఇందులో తను  డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.   ప్రియా భవానీ శంకర్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. స్నేహా, లైలా,  జయరాయ్, ప్రశాంత్, ప్రభుదేవా, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.