తమిళనాడులో అంధులకు పెళ్లి చేసిన పోలీసులు 

తమిళనాడులో అంధులకు పెళ్లి చేసిన పోలీసులు 

తమిళనాడు పోలీసులు సేవాతత్వాన్ని చాటుకున్నారు. పెళ్లి పెద్దలుగా మారి.. ఇద్దరు అంధులకు దగ్గరుండి పెళ్లి  చేయించారు. ఈ వివాహ ఘట్టానికి వడపళని పట్టణంలోని ఓ గుడి వేదికగా నిలిచింది. ఎంఏ, బీఎడ్ చేసిన వరుడు పుట్టుకతోనే అంధుడు. అతడి మరో అంధ యువతితో పెళ్లి చేశారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ ఈ వివాహం జరిగింది. లయన్స్ క్లబ్, స్థానిక ఇన్ స్పెక్టర్ ఆనంద్ బాబు నేతృత్వంలోని పోలీస్ టీమ్ కలిసి ఈ పెళ్లికి అయిన మొత్తం ఖర్చును భరించారు.

ఈ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘ పోలీసులు నేరాలను తగ్గించడానికే కాదు.. సాంఘిక సేవా కార్యక్రమాలను చేయడానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నరు. అందుకు ఇదొక నిదర్శనం’’ అని ఇన్ స్పెక్టర్ ఆనంద్ బాబు తెలిపారు. వివాహం అనంతరం పోలీసుల టీమ్, లయన్స్ క్లబ్ సభ్యులు వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వడపళని పట్టణ పోలీసుల సేవా తత్వాన్ని నెటిజన్స్ వేనోళ్ల కొనియాడుతున్నారు.