
నీళ్లు, నిధులు,నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ ఇప్పటికి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. రాజ్భవన్లో రాష్ట్ర అవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధిని మాత్రమే చూడటం కాదని, మారుమూల పల్లెలు కూడా అభివృద్ధి చెందితేనే అసలైన అభివృద్ధి అనిపించుకుంటుందని తెలిపారు.
Also Read : బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది : బండి సంజయ్
తెలంగాణ వీరులకు జోహార్లు తెలిపిన గవర్నర్.. ఉద్యమకారులకు సన్మానం చేశారు. జై తెలంగాణ అనేది ఆత్మగౌరవ నినాదమని తెలిపారు. కేంద్ర సహకారంతోనే రాష్ట్రంలోఅనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. తన జీవితంలో ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు.