
బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అవిర్భావ వేడుకులు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగరవేసిన సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ప్రజలు అంతో ఇంతో సంతోషంగా ఉన్నారంటే అది కేంద్ర నిధులతోనేని చెప్పారు. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతుందన్న సంజయ్ .. రైతుల అత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని అన్నారు.
నలుగురి కోసం తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బండి సంజయ్ వెల్లడించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.