
న్యూఢిల్లీ: లాస్ట్ బాల్ వరకు థ్రిల్లింగ్‌గా సాగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో.. డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు విన్నర్‌గా నిలిచింది. లాస్ట్ బాల్‌కు 5 రన్స్ అవసరమైన దశలో... పవర్ హిట్టర్ షారూక్ ఖాన్ (15 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 33 నాటౌట్) సూపర్ సిక్సర్ కొట్టాడు. దీంతో సోమవారం జరిగిన టైటిల్ ఫైట్‌లో తమిళనాడు 4 వికెట్ల తేడాతో కర్నాటకపై గెలిచింది. అత్యధికంగా మూడోసారి ట్రోఫీ నెగ్గి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కర్నాటక 20 ఓవర్లలో 151/7 స్కోరు చేసింది. అభినవ్ మనోహర్ (46) టాప్ స్కోరర్. ప్రవీణ్ దూబే (33), కరుణ్ నాయర్ (18), సుచిత్ (18) ఓ మాదిరిగా ఆడారు. తమిళనాడు బౌలర్లలో సాయి కిశోర్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో తమిళనాడు 20 ఓవర్లలో 153/6 స్కోరు చేసి గెలిచింది. చివరి ఓవర్లో 16 రన్స్ అవసరం కాగా ప్రతీక్ జైన్ (1/34) బౌలింగ్‌లో సాయి కిశోర్ (6 నాటౌట్) ఫోర్ సహా ఫస్ట్ ఐదు బాల్స్‌కు 11 రన్స్ వచ్చాయి. ఇక లాస్ట్ బాల్‌కు సిక్సర్ అవసరం కాగా 26 ఏళ్ల షారూక్ కూల్‌గా డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టి హీరో అయ్యాడు. స్టార్టింగ్‌లో హరి నిషాంత్ (23), నారాయణ్ జగదీశన్ (41) రాణించారు. షారూక్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.