
రూ.2.25 కోట్లతో చేయించిన తమిళనాడు భక్తుడు
తిరుమల, వెలుగు: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి తమిళనాడు భక్తుడు అపురూప కానుక ఇవ్వనున్నారు. దాదాపు రూ. 2.5 కోట్ల విలువైన ఆరు కిలోల బంగారంతో అభయ, కఠి హస్తాలు తయారు చేయించారు. శనివారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో వ్యాపారవేత్త తంబిదురై శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం టీటీడీ ఆఫీసర్లకు ఆభరణాలు అందజేస్తారు. తన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో స్వామి వారికి మొక్కుకున్నట్లు వెల్లడించారు.