తమిళనాడులో లాక్ డౌన్ 21 వరకు పొడిగింపు

తమిళనాడులో లాక్ డౌన్ 21 వరకు పొడిగింపు
  • కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
  • కేటగిరీని బట్టి కర్ఫ్యూ సడలింపు టైమ్ టేబుల్

చెన్నై: తమిళనాడులో లాక్ డౌన్ కొన్ని సడలింపులతో ఈనెల 21 వరకు పొడిగించారు. ఈనెల 14 వరకు తొలుత లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 వరకు ఉన్న కర్ఫ్యూ ఆంక్షల సడలింపును కేటగిరీల వారీగా కొన్నింటికి మధ్యాహ్నం 2 వరకు మరికొన్నింటికి సాయంత్రం 5 వరకు సడలింపు ఇచ్చారు. చెన్నై నగరం సహా పశ్చిమ తెలంగాణలోని 11 జిల్లాలో మినహా మిగిలిన జిల్లాల్లో సడలింపులు పొడిగించారు. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఆంక్షల సడలింపుల వివరాలు ఇలా ఉన్నాయి
ఉదయం 6 గంటల నుంచి 9 వరకు:  పార్కులు ఓపెన్( కేవలం వాకింగ్ కోసమే)
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు: కళ్ల జోడు దుకాణాలు (ఆప్టికల్ షాప్స్), మొబైల్ ఫోన్ల దుకాణాలు, ఎలక్ర్టానిక్ ఉత్పత్తుల అమ్మకం మరియు రిపేరీ చేసి సర్వీస్ సెంటర్లు, హార్డ్ వేర్ దుకాణాలు, 
స్కూల్లు, కాలేజీలు అడ్మిషన్ల కోసం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2వరకు తెరచుకోవచ్చు. 
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు: చేతి వృత్తులు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారులు
ప్రైవేటు సంస్థలు వారి వద్ద ఉన్న ఉద్యోగుల సంఖ్య ప్రకారం 20 శాతం లేదా.. 33 శాతం.. లేదా 50 శాతం మించ కుండా విధులు నిర్వహించుకోవాలి.