
ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరికి దక్కనుందో అన్న సస్పెన్స్ దాదాపు వీడిపోయింది. ముగ్గురు, నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపించినా చివరిగా తమ్మినేని సీతారాంను వైఎస్ జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తమ్మినేని సీతారాం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిశారు. పార్టీలో సీనియర్ నేత , మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకుడిగా ఆయన గుర్తింపు ఉండటంతో.. జగన్ సీతారాం వైపు మొగ్గు చూపినట్టు చెబుతున్నారు.