ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌తోపాటు మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
#ShankarMahadevan 🔱 #KailashKher 🔱🙌🏿🔥
— thaman S (@MusicThaman) November 5, 2025
One of Massively Produced Track ON ITS JOURNEY
A-K-H-A-N-D-A-T-H-A-N-D-A-V-A-M #Akhanda2FirstSingle
PROMO ON - 7 th NOV
FULL SONG - 9 th NOV #JaiBalayya 🦁 pic.twitter.com/qt7fN3Ok8C
ఈ సాంగ్‌ను తమన్ కంపోజ్ చేయగా, కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని లిరిక్స్ అందించాడు. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ కలిసి పాడారు. ‘అఖండ తాండవం.. హర హర మహాదేవ.. ఓం నమ: శివాయ’ అంటూ పవర్‌ఫుల్‌గా సాగిన ప్రోమో ఆకట్టుకుంది.
ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకంతో బాలకృష్ణ చేసిన తాండవం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫుల్ సాంగ్‌ను నవంబర్ 14న విడుదల చేయనున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
