తండేల్ మూవీ శ్రీకాకుళం షెడ్యూల్ కంప్లీట్

తండేల్ మూవీ శ్రీకాకుళం షెడ్యూల్ కంప్లీట్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తాజాగా వైజాగ్, శ్రీకాకుళం షెడ్యూల్‌‌‌‌ను పూర్తి చేసుకుంది.  ఈ షెడ్యూల్‌‌‌‌లో చైతూ, సాయి పల్లవి మధ్య చిత్రీకరించిన  కీలక సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ చెప్పారు.  ఇందులో రాజు పాత్రలో జాలరిగా చైతూ నటిస్తుండగా, తనని ప్రేమించే అమ్మాయిగా సాయి పల్లవి నటిస్తుంది. 

వీరిద్దరూ డీ గ్లామర్ లుక్‌‌‌‌లో కనిపించనున్నారు.  రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి దాదాపు రెండేళ్లు జైల్లో ఉండి భారత్‌‌‌‌కు తిరిగి వచ్చిన రాజు అనే మత్య్సకారుడి నిజ జీవిత కథే ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్, స్టిల్స్ మూవీపై ఆసక్తిని పెంచాయి. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్  సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేయనున్నారు.