వికారాబాద్ జిల్లాలో చిన్నారికి సీపీఆర్తో ప్రాణదానం

వికారాబాద్ జిల్లాలో చిన్నారికి సీపీఆర్తో ప్రాణదానం
  •     7 నెలల బాబు ప్రాణాలు కాపాడిన ​టెక్నీషియన్ 

తాండూరు, వెలుగు:  ఏడు నెలలకే పుట్టిన శివువుకు గుండె చప్పుడు ఆగిపోవడంతో అంబులెన్స్ టెక్నీషియన్ సీపీఆర్‌‌‌‌ చేసి ప్రాణాలు పోశాడు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌‌‌‌పేట్ మండలం తుంకిమొట్లకు చెందిన భువనేశ్వరి, నవీన్ దంపతులకు మూడు రోజుల క్రితం తాండూరులోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మగ పిల్లాడు పుట్టాడు. 

ఏడు నెలలకే పుట్టడంతో బరువు తక్కువగా ఉండడం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌‌‌‌ నిలోఫర్ దవాఖానకు రెఫర్​చేశారు. 108 లో హైదరాబాద్‌‌‌‌కు తీసుకువెళ్తుండగా మన్నెగూడ సమీపంలో గుండె చప్పుడు ఆగిపోయింది. అంబులెన్స్ టెక్నీషియన్​ శాంత్‌‌‌‌కుమార్ సీపీఆర్‌‌‌‌ చేసి ప్రాణాలు కాపాడాడు. తర్వాత నిలోఫర్​లో అడ్మిట్​చేశారు.