హైదరాబాద్‎లో రెండు కొత్త స్టోర్లను ప్రారంభించిన తనిష్క్​

హైదరాబాద్‎లో రెండు కొత్త స్టోర్లను ప్రారంభించిన తనిష్క్​

హైదరాబాద్, వెలుగు: టాటా గ్రూపునకు చెందిన జ్యూయలరీ బ్రాండ్​తనిష్క్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సన్‌‌‌‌‌‌‌‌సిటీ,  కోకాపేటలో బుధవారం స్టోర్లను ప్రారంభించింది.  సన్‌‌‌‌‌‌‌‌సిటీ స్టోర్‌‌‌‌‌‌‌‌ను చీఫ్ పీపుల్ ఆఫీసర్ స్వదేశ్ కుమార్ బెహెరా, రీజినల్ బిజినెస్ హెడ్ - సౌత్ అజయ్ ద్వివేది ప్రారంభించారు. ఈ కొత్త స్టోర్లలో బంగారం, వజ్రాలు, కుందన్, పోల్కీ, వివాహ నగలను ప్రదర్శించారు.

 7,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న సన్‌‌‌‌‌‌‌‌సిటీ స్టోర్, 8,500  చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కోకాపేట స్టోర్ బంగారం, వజ్రాలు, కుందన్  పోల్కీ నగల కలెక్షన్లను అందిస్తాయి. గాజు పొడితో పూత పూసిన ప్రత్యేకమైన మంగళసూత్రాలనూ వీటిలో కొనుక్కోవచ్చు. పురుషుల కోసం అవీర్​నగలు అందుబాటులో ఉంటాయి. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం పొందవచ్చని, ఈ ఆఫర్ ఈ నెల 25 వరకు వర్తిస్తుందని తనిష్క్​పేర్కొంది.