పొలానికి ట్యాంకర్​ నీళ్లు : అన్నదాతకు అడుగడుగునా కష్టాలే

పొలానికి ట్యాంకర్​ నీళ్లు : అన్నదాతకు అడుగడుగునా కష్టాలే

యాదాద్రి వెలుగు:  ఆత్మకూరు (ఎం) మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తొల్పునూరి చంద్రయ్య రెండు బావులు, ఒక బోరు మోటారు ఉండడంతో 5 ఎకరాల్లో వరి సాగు చేశాడు. భూగర్భజలాలు అడుగంటిపోవడం, ఎండలు తీవ్రమవడంతో పొలం కొద్దికొద్దిగా ఎండిపోతోంది. వరి పంట కంకుల దశలో ఉండటంతో మరికొన్ని తడులు ఇస్తే చేతికొస్తుందన్న ఆశతో ఒక ట్యాంకర్​కు రూ. 700 చొప్పున వెచ్చించి ఇలా నీటిని పోయిస్తున్నాడు.  బుధవారం ఒక్కరోజే నాలుగు ట్యాంకర్లతో పంటకు తడులు అందించాడు. పంట చేతికందేవరకు రోజు విడిచి రోజు ఇలా నీటిని అందిస్తానని తెలిపారు.

చందుపట్లలో

భువనగిరి మండలంలోని చందుపట్లలో రైతు మల్లారెడ్డి.. తన వ్యవసాయ భూమిలోని 3 ఎకరాల్లో వరి పంట వేశాడు. ఇతడిదీ సేమ్ పరిస్థితి. 2 బోర్లల్లో నీళ్లు రావడంలేదని.. దీంతో పొట్టకొచ్చిన పంటను ఎలాగైనా దక్కించుకోవాలని ట్యాంకర్ తో తడులు పెడుతున్నట్లు తెలిపాడు.

see also: భారతీయుడు2 షూటింగ్​లో ప్రమాదం

రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఆగింది!

సర్కార్ ఫోకస్ : రిటైర్మెంట్​ ఏజ్​ 61