టిస్కాన్‌‌‌‌ యూత్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ రెగట్టా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తనుజ-శ్రవణ్‌‌‌‌, రమీజాకు గోల్డ్ మెడల్స్‌‌‌‌

టిస్కాన్‌‌‌‌ యూత్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ రెగట్టా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తనుజ-శ్రవణ్‌‌‌‌, రమీజాకు గోల్డ్ మెడల్స్‌‌‌‌

––హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ క్లబ్ టిస్కాన్‌‌‌‌ యూత్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ రెగట్టా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తెలంగాణ సెయిలర్లు సత్తా చాటారు. తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్‌‌‌‌కు చెందిన ఎస్కే రమీజా భాను, తనుజ కామేశ్వర్- –శ్రవణ్ కత్రావత్ స్వర్ణ పతకాలతో మెరిశారు. హుస్సేన్ సాగర్ లేక్‌‌‌‌లో బుధవారం ముగిసిన పోటీల్లో తనుజ కామేశ్వర్– శ్రవణ్ కత్రావత్ జోడీ  420 మిక్స్‌‌‌‌డ్ కేటగిరీ ఈవెంట్‌‌‌‌లో టాప్ ప్లేస్‌‌‌‌తో బంగారు పతకం సొంతం చేసుకుంది. ఆప్టిమిస్ట్  మెయిన్ ఫ్లీట్ గర్ల్స్‌‌‌‌లో రమీజా భాను స్వర్ణం నెగ్గగా, తత్తారి చంద్రలేఖ కాంస్య పతకం గెలిచింది. 

ఆప్టిమిస్ట్  గ్రీన్ ఫ్లీట్ గర్ల్స్‌‌‌‌లో జె. శిరీష రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచి సిల్వర్ అందుకోగా.. బాయ్స్‌‎లో వి. హనుమంతు కాంస్య పతకం సాధించాడు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విన్నర్లకు మెడల్స్ ట్రోఫీలు అందజేశారు. యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ కెప్టెన్ జితేంద్ర దీక్షిత్, సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కైలాస, వైస్ ప్రెసిడెంట్, అశ్విన్ నందన్ సింగ్ తదితరులు హాజరయ్యారు.