మహిళలు ఉద్యోగం చేస్తే సమాజం నాశనమే!: బంగ్లా క్రికెటర్

మహిళలు ఉద్యోగం చేస్తే సమాజం నాశనమే!: బంగ్లా క్రికెటర్

బంగ్లాదేశ్ యంగ్ క్రికెటర్ తంజిమ్ హసన్ షకీబ్ పేరు క్రికెట్ అభిమానులకి గుర్తుండే ఉంటుంది. ఆసియా కప్ లో భాగంగా భారత్ తో తొలి  మ్యాచ్ ఆడిన ఈ యంగ్ క్రికెటర్.. అరంగ్రేటంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, తిలక్ వర్మ వికెట్ పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు చివరి ఓవర్ వేసి బంగ్లాకు విజయాన్ని అందించాడు. బంగ్లా భవిష్యత్తు స్టార్ గా కితాబులందుకున్నా ఈ యంగ్ సంచలనం.. ప్రస్తుతం చిక్కుల్లో పడ్డాడు.
 
మహిళలను కించపరిచే వ్యాఖ్యలు
 
అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుపెట్టాడో లేదో అప్పుడే తంజీమ్ స్త్రీలను అగౌరపరిచే విధంగా వ్యాఖ్యలు చేసాడు. 20 ఏళ్ళ ఈ పేసర్.. తాజాగా స్త్రీలను కించపరిచేలా వారిని ద్వేషిస్తూ చిన్న చూపు చూస్తున్నట్లుగా కొన్ని పోస్ట్‌లు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు తంజీమ్ సోషల్ మీడియా వేదికగా మహిళల చేతిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ జట్టు జెర్సీలను తయారు చేసే దుస్తుల కర్మాగారాల్లో మహిళలే ప్రధాన శక్తిగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అవమానకరమైన పోస్ట్‌లను సోషల్ మీడియా వేదికగా చాలా మంది మహిళలు ప్రశ్నించారు.

ALSO READ: Asia Cup 2023 Final: సిరాజ్ కు కోహ్లీ భార్య అభినందనలు..

"భార్య పని చేస్తే భర్త హక్కులకు భరోసా ఉండదు. భార్య పనిచేస్తే పిల్లల హక్కులకు భరోసా ఉండదు. భార్య పనిచేస్తే గాంభీర్యం దెబ్బతింటుంది. భార్య పని చేస్తే కుటుంబం నాశనమవుతుంది. భార్య పనిచేస్తే సమాజమే నాశనం అవుతుంది. అని తంజీమ్ పోస్ట్ చేసాడు. సమాజంలో స్త్రీలు ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తుంటే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తంజీమ్ పై బంగ్లా బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది.