నల్లా బిల్లును రద్దు చేయాలి: ప్రొఫెసర్లు ఘంటా చక్రపాణి, కాసీం

నల్లా బిల్లును రద్దు చేయాలి: ప్రొఫెసర్లు ఘంటా చక్రపాణి, కాసీం

మేడిపల్లి, వెలుగు: పాఠ్య పుస్తకాల్లో సిలబస్ మార్చుతూ, మూఢ నమ్మకాలు పెంపొందించేలా జరుగుతున్న విద్య కాషాయీకరణను వ్యతిరేకిస్తూ స్టూడెంట్లు పోరాడాలని టీఎస్​పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి,  ప్రొఫెసర్ కాసీం పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన​శిక్షణా తరగతుల ముగింపు ప్రోగ్రామ్ బుధవారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లోని ఓ ఫంక్షన్​హాల్​లో నిర్వహించారు.

మతోన్మాదం, లౌకికవాదం అనే అంశాలపై ప్రొఫెసర్లు క్లాస్​లు బోధించారు.  చదువు అనే ఆయుధాన్ని చేతపట్టి స్టూడెంట్లు సమాజాన్ని మార్చాలని కోరారు. అనంతరం సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి పాటలు పాడి అలరించారు. శిక్షణా తరగతుల్లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు  స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.