
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలంలోని మోత్కుపల్లిలో కల్లులో తోక పురుగులు దర్శనమిచ్చాయి. గ్రామానికి చెందిన ఈడిగి శ్రీనివాస్‌గౌడ్ స్థానికంగా కల్లు దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం ఉదయం కొందరు మహిళలు ఇక్కడ కల్లు తీసుకుని ఇంటికి వెళ్లారు. తీరా కల్లు తాగుదామని చూస్తే.. అందులో తోక పురుగులు కన్పించాయి. దీంతో ఆగ్రహం చెందిన మహిళలు కల్లు దుకాణానికి వెళ్లి నిలదీశారు.
దుకాణంలో ఉన్న మిగితా కల్లు బాటిళ్లలోనూ తోక పురుగులు ఉండడంతో మొత్తం పారబోశారు. నిర్లక్ష్యంగా కల్లు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్లు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, మోత్కుపల్లిలో కల్లులో తోక పురుగులు వచ్చిన విషయం ఆదివారం మధ్యాహ్నం తమ దృష్టికి వచ్చిందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్విజయభాస్కర్గౌడ్ తెలిపారు. కల్లు దుకాణంలో శాంపిల్స్సేకరించడానికి ప్రత్యేక బృందాన్ని పంపినట్లు చెప్పారు.