Tarakaratna: హైదరాబాద్కు తారకరత్న.?

Tarakaratna: హైదరాబాద్కు తారకరత్న.?

నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండటంతో రేపు హైదరాబాద్ కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నకు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయినా తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు  అతడిని  రేపు(ఆదివారం) ఉదయం హైదరాబాద్ కు తరలిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ సహా కొందరు కుటుంబ సభ్యులు బెంగళూరు  ఆస్పత్రికి  వెళ్లారు. డాక్టర్లతో చర్చలు జరుపుతున్నారు.

జనవరి 27న  కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో అస్వస్థత గురయ్యారు. వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన ట్రీట్ మెంట్ కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ తారకరత్నకు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.