V6 News

NTR పేరు కలిసేలా పిల్లలకు పేర్లు పెట్టిన తారకరత్న

NTR పేరు కలిసేలా పిల్లలకు పేర్లు పెట్టిన తారకరత్న

సినీ నటుడు నందమూరి తారకరత్న  కన్నుమూయడంతో  చిత్ర పరిశ్రమలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తారకరత్నకు తన తాత నందమూరి తారక రామారావు అంటే ఎంతో అభిమానం. అందకే తన పిల్లలకు ఆయన పేరు కలిసేలా పెట్టారు. తారకరత్న అలేఖ్యారెడ్డి ప్రేమించి వివాహం చేసుకోగా వీరికి ముగ్గురు పిల్లలున్నారు. మొదట పాప పుట్టగా నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలు పుట్టారు. వీరికి తాన్యారామ్‌, రేయా అని పేరు పెట్టారు. వీరి ముగ్గురి పేర్లలో మొదటి అక్షరాలు NTR తో వస్తాయి.  తాత ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో వారికి అలా తారకరత్న పేర్లు పెట్టారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా గుండెపోటుకు గురైన తారకరత్న  కొన్ని రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. రేపు సాయంత్రం తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.