ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో తరుణ్ చుగ్ సమావేశం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో తరుణ్ చుగ్ సమావేశం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ పార్టీ స్టేట్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర, ముగింపు సభకు జన సమీకరణపై చర్చించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17న నిర్వహించే విమోచన దినోత్సవం సభకు జనసమీకరణతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం, నియోజకవర్గ ఇన్ చార్జీల నియామకంపై చర్చించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన ఆయన శనివారం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పరామర్శించారు. అనంతరం జనగామలోని రఘునాథపల్లెలో పార్టీ కార్యకర్త ఇంట్లో టీ తాగారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చి నాంపల్లిలో ఉన్న బీజేపీ స్టేట్ ఆఫీసుకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు వరుసగా జిల్లా నేతలతో మాట్లాడనున్నారు.