హైదరాబాద్, వెలుగు: ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని విజయేంద్ర ప్రసాద్ నివాసంలో కలిసి రాజ్యసభకు నామినేట్ అయినందున ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా రజాకార్ ఫైల్స్ సినిమాపై వారు చర్చించినట్లు తెలిసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆయనతో మాట్లాడినట్టు సమాచారం.
