కేసీఆర్ అహంకారం తగ్గాలంటే హుజురాబాద్ ఎన్నికల్లో ఈటలను గెలిపించాలన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు తరుణ్ చుగ్. సబ్ కా సాత్... సబ్ కా వికాస్ నినాదంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
