దేశరక్షణపై సీఎం కేసీఆర్ అహంకారంతో మాట్లాడారు

 దేశరక్షణపై సీఎం కేసీఆర్ అహంకారంతో మాట్లాడారు

దేశ రక్షణపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్.  సీఎం  స్థానంలో ఉన్న వ్యక్తి దేశరక్షణపై అహంకారంతో మట్లాడటం బాధాకరమన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఒక్క ఇంచ్ భూమిని కూడా చైనా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. అధికారం మత్తులో కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. అంతేకాదు..పెట్రోల్, డీజీల్  పై 2015 ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రభుత్వం వ్యాట్ ను పెంచిందని తెలిపారు. తెలంగాణలో సాయంత్రం ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరి కేసీఆర్ పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గింట్లేడదని ప్రశ్నించారు. తరుణ్ చుగ్.