ఇయ్యాల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై సమీక్ష

ఇయ్యాల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై సమీక్ష

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో జులై 2, 3తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ శనివారం సమీక్ష జరపనున్నారు. స్టేట్ పార్టీ ఆఫీసులో రాష్ట్ర ముఖ్య నేతలతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. సమావేశాల ఏర్పాట్లపై నియమించిన 34 కమిటీలతో పాటు, స్టీరింగ్ కమిటీ నేతలు మీటింగ్ లో పాల్గొంటారు. జులై3 న జరుగనున్న ప్రధాని మోడీ బహిరంగ సభ, జన సమీకరణ అంశాలపై కూడా బీజేపీ నేతలు చర్చించనున్నారు.