జూబ్లీహిల్స్ మైనర్ కేసులో పోలీసులు అవకతవకలకు పాల్పడ్డారు

జూబ్లీహిల్స్ మైనర్ కేసులో పోలీసులు అవకతవకలకు పాల్పడ్డారు

జూబ్లీహిల్స్ మైనర్  కేసులో పోలీసులు అవకతవకలు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. అఘాయిత్యం జరిగిన వాహనం ప్రభుత్వ వాహనమని గుర్తించడానికి ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు.  దోషులును రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయతిస్తున్నారన్న ఆయన..కేసీఆర్ ఎట్లా చెప్పితే  పోలీసులు అలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొంతమంది పోలీసులు కేసీఆర్ కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తున్నారని అన్నారు. ఆ పోలీసులు  కుటుంబం కోసం మానేసి ప్రజల కోసం పని చేయాలని సూచించారు.  జూబ్లీహిల్స్ కేసులో న్యాయం జరిగే వరకు బాధితురాల పక్షాన బీజేపీ పోరాడుతుందని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.  నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

కాగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న  సాదుద్దీన్ మాలిక్ ను  పోలీసులు ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు.  విచారణ నిమిత్తం సాదుద్దీన్ ను చంచల్ గూడ జైలు నుండి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. మూడు రోజుల పాటు అతడిని విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో ఉన్నారు.