
నాష్‌విల్లే: టార్జాన్ టెలివిజన్ సీరియల్‌తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న జో లారా (58) కన్నుమూశారు. జో లారా ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్.. అమెరికాలోని నాష్‌విల్లేకు దగ్గర్లోని ఓ సరస్సులో కూలింది. ఈ ప్రమాదంలో జో లారా, ఆయన సతీమణి గ్వెన్‌తోపాటు మరో ఐదురుగు చనిపోయారు. మృతదేహాలను పోలీసులు సరస్సు నుంచి వెలికితీశారు. కాగా, 58 ఏళ్ల జో లారా టార్జాన్ సిరీస్‌తో వరల్డ్‌వైడ్‌గా గుర్తింపు పొందారు. దీంతోపాటు సన్‌సెట్ హీట్ (1992), అమెరికన్ సైబోర్గ్: స్టీల్ వారియర్ (1993), ఫైనల్ ఎక్వినోక్స్ (1995), డూమ్స్‌డేయర్ (2000), బేవాచ్ అండ్ కోనన్ సిరీస్‌ల్లోనూ నటించి తన యాక్టింగ్‌తో లారా మెప్పించారు.