 
                                    - ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడర్ సతీశ్పారిపోయేందుకు
- సహకరించాడనే ఆరోపణలు
- సెంట్రల్ జోన్ ఎస్ఐ శ్రీకాంత్‌పై వేటు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ సెంట్రల్జోన్టాస్క్ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్‌ను సీపీ సజ్జనార్ గురువారం సస్పెండ్‌చేశారు. ఓ కేసులో నిందితుల నుంచి డబ్బులు తీసుకొని, వారు తప్పించుకునేలా చేసినట్టు ఆయనపై ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, రూ.3 వేల కోట్ల మోసాలకు పాల్పడిన ఓ అంతర్రాష్ట్ర నిందితుడిని రూ.2 కోట్లు తీసుకుని తప్పించాడన్న అభియోగాలు శ్రీకాంత్ పై ఉన్నాయి. వ్యాపారంలో , పెట్టుబడి స్కీమ్స్‌లో కల్పిస్తానని చెప్పుకుని చాలామంది పెట్టుబడిదారులను మోసం చేశాడన్న ఆరోపణలు సతీశ్‌పై ఉన్నాయి. నగరంలో ఉంటున్న కేంద్ర మాజీ మంత్రి కొడుకును మోసగించి రూ.25 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులోనూ సతీశ్ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
ఇలా ఇతడు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో సుమారు ₹3,000 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇతడిపై ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ లో ఇన్వెస్ట్మెంట్ఫ్రాడ్తో పాటు పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అతడి గురించి వెతుకుతుండగా ముంబైలో ఉన్నట్టు గత వారం టాస్క్ఫోర్స్పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ నేతృత్వంలో ఒక బృందంఅక్కడికి వెళ్లింది. సతీశ్‌తో పాటు ఆయన భార్య, బిడ్డను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నిందితులను పోలీసుల వాహనంలో నగరానికి తీసుకురావాలి.
కానీ, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్మాత్రం తన టీమ్‌తో కాకుండా నిందితుల కారు ఎక్కాడు. పైగా ఈ వెహికల్‌ను నిందితుడి డ్రైవరే నడపడం గమనార్హం. వీరి వాహనం సదాశివపేట చేరడానికి 2 గంటల ముందే నగరం నుంచి మరో కారు వచ్చి అక్కడున్న దాబా వద్ద సిద్ధంగా ఉంది. ఆ కారులోకి మారిన నిందితులు కొల్లపూర్వైపు పరారయ్యారు.
అక్కడ, వాళ్లను వదిలేసిన ఎస్ఐ తాను హైదరాబాద్ వెళ్తున్నట్టు తన సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంలో టాస్క్ఫోర్స్ఎస్ ఐ శ్రీకాంత్ప్రమేయం ఉందని, నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ప్రాథమిక సమాచారం అందడంతో ఆయనను సస్పెండ్ చేశారు. పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాంత్‌తో పాటు ఇతర అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని సూచించారు.

 
         
                     
                     
                    