టాస్క్ ఫోర్స్ టీం ఉత్తర్వులను హోల్డ్లో పెట్టిన ప్రభుత్వం

టాస్క్ ఫోర్స్ టీం ఉత్తర్వులను హోల్డ్లో పెట్టిన ప్రభుత్వం

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీం ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హోల్డ్ లో పెట్టింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్ అత్యవసరంగా ఉత్తర్వులు జారీ చేశారు. సర్కార్ స్కూళ్ల పర్యవేక్షణ కోసం జిల్లా అకడమిక్‌ టాస్క్‌ఫోర్స్‌ పేరిట ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అక్షరాస్యత పెంపొందించేందుకు అక్షరాస్యత ఫౌండేషన్, సంఖ్యాశాస్త్రం (ఎఫ్‌ఎల్‌ఎన్‌, తొలిమెట్టు)పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయడమే లక్ష్యంగా పాఠశాలల్లో టాస్క్ ఫోర్స్ పేరిట గతంలో కమిటీలను నియమించింది. 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు అగ్రహం వ్యక్తం చేయడంతో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హోల్డ్ లో పెడుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పరిపాలన కారణాలతో హోల్డ్ లో ఉంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.